SSMB 28 రూమర్స్ పై ఫైర్ అయిన వంశీ 

SSMB28 Producer Naga Vamsi Fires about Rumours

సూపర్ స్టార్ మహేష్ బాబు,స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన అతడు,ఖలేజా థియేటర్లలో అనుకున్నంతగా ఆడకపోయినా బుల్లితెరపై బ్లాక్ బాస్టర్ హిట్లయ్యాయి. ఈసినిమాలకు చాలా మందే  ఫ్యాన్స్ వున్నారు.ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా కూడా వస్తుంది.అదే SSMB 28(వర్కింగ్ టైటిల్).ఈసినిమాపై సహజంగానే భారీ అంచనాలు వున్నాయి.అయితే షూటింగ్ ప్రారంభమైన దగ్గరనుండి సినిమా గురించి ఏదో ఒక రూమర్ వస్తూనే వుంది. ఇటీవల  ఈరూమర్స్ మరీ ఎక్కువైపోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త్రివిక్రమ్ విషయంలో మహేష్ హ్యాపీ గా లేడని రీసెంట్ గా జరిగిన షెడ్యూల్ సీన్లను డిలేట్ చేస్తున్నారని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి.ఈ రూమర్ల పై నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు.ఆహారం కోసం పక్షులు గట్టిగా అరుస్తాయి అలాగే  అటెన్షన్ కోసం ఇలాంటి పుకార్లు పుట్టిస్తారు వీటిని చూసి నవ్వుకోవాలి లేదా పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలి.ఫ్యాన్స్ ఒకటి గుర్తుంచుకోండి ఈ సినిమా మీరు ఎప్పటికి గుర్తిండిపోయాలా ఉంటుందని వంశీ ట్విట్టర్ ద్వారా తెలిపారు.అంతేకాదు వచ్చే నెల 31న ఈసినిమా నుండి సూపర్ అప్డేట్ ఇవ్వనున్నామని వంశీ మరో ట్వీట్ చేశాడు.

ఇక త్రివిక్రమ్ సినిమాలకు ఇలాంటి పుకార్లు రావడం కొత్తేమి కాదు.గతంలో అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో తీస్తున్నపుడు కూడా సినిమా బాగా రావడం లేదని వార్తలు వచ్చాయి కట్ చేస్తే విడుదల తరువాత రికార్డులు క్రియేట్ చేసి బ్లాక్ బాస్టర్ అయ్యింది.సో మహేష్ -తివిక్రమ్ సినిమాకు కూడా ఇలాగే జరుగుతుంది. ఈసినిమా కూడా సంక్రాంతికే రానుంది.ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.త్వరలోనే  కొత్త షెడ్యూల్ సార్ట్ కానుందని సమాచారం.పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తుంది.థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 20 =