తమిళ్ స్టార్ హీరో విశాల్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా ఆశించినంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. విశాల్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మార్క్ అంథోని. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు విశాల్. అంతేకాదు ఈసినిమాలో డిఫరెంట్ లుక్ లో కూడా కనిపించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను బట్టి చెప్పొచ్చు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇళయదళపతి విజయ్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఇక టీజర్ ని బట్టి ఈసినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో వస్తున్నట్టు అర్థమవుతుంది. టీజర్ లో విశాల్, ఎస్ జె సూర్య, రీతువర్మ, అభినయ, సునీల్ ల పెర్ఫార్మన్స్ తో పాటు యక్షన్, ఫైట్స్, థ్రిల్లింగ్ సన్నివేశాలు, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి.
Proudly presenting the #MarkAntony (Telugu) Teaser https://t.co/Ii1r7mhyyg
A @gvprakash massacre💣#MarkAntonyTeaser @VishalKOfficial @iam_SJSuryah @vinod_offl @Adhikravi @riturv @suneeltollywood @selvaraghavan @mgabhinaya @ministudiosllp #MarkAntonyTelugu
— Vishal Film Factory (@VffVishal) April 27, 2023
కాగా ఈసినిమాలో విశాల్ కు జోడీగా రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్ జె సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ కూడా పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మినీ స్టూడియో బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తుండగా.. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మరి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విశాల్ కు ఈసినిమాతో అయినా హిట్ అందుతుందో లేదో చూద్దాం..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: