పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన వకీల్ సాబ్ 2021లో విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. కరోనా టైం లో కూడా కాసుల వర్షం కురిపించింది.బాలీవుడ్ మూవీ పింక్ కు రీమేక్ గా వచ్చిన ఈచిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు.పవన్ ఫస్ట్ టైం ఈసినిమాతో లాయర్ గెట్అప్ లో కనిపించాడు. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని వేణు శ్రీరామ్,ట్విట్టర్ స్పేస్ లో వెల్లడించాడు.దాంతో వేణు శ్రీరామ్,పవన్ ను మరో సారి డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వరస సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీ గా వున్నాడు.అందులో భాగంగా పవన్ ఇటీవలే వినోదయసీతం రీమేక్ షూటింగ్ పూర్తి చేశాడు.సముధ్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈచిత్రంలో సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.త్వరలోనే ఈసినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్,ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్నాడు.గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ -పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈచిత్రం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఈసినిమా కాకుండా పవన్, క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు లో నటిస్తున్నాడు.సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రాన్ని ఎంఎమ్ రత్నం నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలతో పాటు యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో ఓజి లో నటించనున్నాడు పవన్.ఈనెలలోనే ఈసినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.డివివి దానయ్య ఈసినిమాను నిర్మిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: