బాహుబలి సిరీస్, సాహో సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఆదిపురుష్, సలార్, సందీప్ వంగాతో స్పిరిట్ సినిమా, మారుతి తో మరో సినిమా చేస్తుండగా.. వీటన్నింటికీ భారీగా పాన్ వరల్డ్ రేంజ్ లో ప్రాజెక్ట్ కే సినిమా వస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమాపై అప్పుడప్పుడు క్రేజీ అప్ డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా కోసం వాడే టైర్ కు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. కేవలం ఒక్క టైర్ కోసమే ఎంతో డిటైలింగ్స్ తో వర్క్ చేయడం చూపించారు. ఆ ఒక్క గ్లింప్సే సినిమాపై ఆసక్తి గలిగేలా చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశారు. స్క్రాచ్ నుంచి రెండో భాగం అంటూ ఈసారి సినిమాలో రైడర్స్ లుక్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది రివీల్ చేశారు. సినిమాలో విలన్స్ ఆర్మీ వారికి సెపరేట్ సూట్ ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో డిజైన్ చేసి చూపించారు. ఇక ఈవీడియో కూడా ప్రస్తుతం ఆకట్టుకుంటూ అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ అప్ డేట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీలో ఉన్నారు. ప్రాజెక్ట్ కే తో ప్రభాస్ ఈసారి భారీ రేంజ్ లోనే వస్తున్నాడని ఖుషీలో ఉన్నారు. మరి నాగ్ అశ్విన్ క్రియేటివ్ వరల్డ్ ను చూడాలంటే మాత్రం వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే.
Who are the raiders?
‘𝐅𝐫𝐨𝐦 𝐒𝐤𝐫𝐚𝐭𝐜𝐡 𝐄𝐩 𝟐: 𝐀𝐬𝐬𝐞𝐦𝐛𝐥𝐢𝐧𝐠 𝐓𝐡𝐞 𝐑𝐚𝐢𝐝𝐞𝐫𝐬’:https://t.co/AUC8ODQ5tK#ProjectK #Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/D4Thqdd8QW
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 10, 2023
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈసినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: