ధనుష్, మారి సెల్వరాజ్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్

dhanush and mari selvaraj second movie announcement

నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్, విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే కర్ణన్ సినిమా రాగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. కర్ణన్ రెండవ వార్షికోత్సవం పురస్కరించుకుని మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఈ రోజు అధికారికం గా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాతో ధనుష్ సొంత బ్యానర్ వండర్బార్ ఫిల్మ్స్ చలనచిత్ర నిర్మాణంలోకి తిరిగి రావడం ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. జీ స్టూడియోస్ మరియు వండర్బార్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రంలో విభిన్న పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు మరియు అగ్ర శ్రేణి సాంకేతిక నిపుణులు భాగం కానున్నారు, వీటికి సంబంధించిన వివరాలు మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.

స్టూడియోస్ సౌత్ మూవీస్ హెడ్ అక్షయ్ కేజ్రీవాల్ ఈసినిమా గురించి మాట్లాడుతూ. వండర్ బార్ ఫిల్మ్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో భాగం కావడం మాకు చాలా ఆనందంగా మరియు గర్వంగా ఉంది. ఈ చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ ‘కర్ణన్ ద్వయం ను మరొక్క సారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా సంతోషం గా ఉంది. తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకున్న ధనుష్ మరియుమారి సెల్వరాజ్ తో కలసి పనిచేయడం మాకు గౌరవం. జీ స్టూడియోస్ లో, ప్రజలను అలరించే మరియు ప్రేరేపించే కంటెంట్ ని రూపొందించడమే మా లక్ష్యం.. ఇక ఈ సినిమాను అదే రేంజ్ లో నిర్మించబోతున్నాం అంటూ తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 4 =