యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా స్టడీ గా వసూళ్ళను రాబట్టుకుంటుంది. ఉగా ది రోజున విడుదలైన ఈ చిత్రం 10రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 11కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా 8.50కోట్ల షేర్ ను రాబట్టింది. ఈగురువారం,నాని నటించిన దసరా విడుదలకావడంతో ధమ్కీ బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదుర్కొంటుంది. అయితే ధమ్కీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. విశ్వక్ సేన్ డ్యూయెల్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటించగా లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.
ఇక ఇదిలావుంటే విశ్వక్ సేన్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. విశ్వక్ నటించిన గామి విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమా కాకుండా విశ్వక్ మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. ఇందులో తన 10వ చిత్రాన్నిఇటీవలే మొదలుపెట్టాడు. ఎస్ ఆర్ టి ఎంటైర్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రవితేజ ముళ్ళపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కాకుండా విశ్వక్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కృష్ణ చైతన్య డైరెక్షన్ లో తన 11వ సినిమాలో నటించనున్నాడు. ఇటీవలే ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ ,శ్రీకర స్టూడియోస్ ,ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మించనుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
Ori Devuda Team Memers Meet | Vishwak Sen | Mithila Palkar | Asha Bhat | Ashwath Marimuthu | TFN
30:26
Vishwak Sen & Nivetha Pethuraj Funny Rapid Fire Interview | Paagal Movie | Star Show With RJ Hemanth
10:54
Vishwak Sen Dhumki Movie Launch | Vishwak Sen | Nivetha Pethuraj | Latest Telugu Movies 2022
11:14
Paagal Movie Best Action Scene | Vishwak Sen | Nivetha Pethuraj | Bhumika | Simran Choudhary | TFN
04:31
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: