సుడిగాడు 2 కథ రాస్తున్నా-అల్లరి నరేష్

allari naresh turned as writer for his super hit movie sequel

అల్లరి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమా టైటిల్ నే ఇంటిపేరుగా మార్చుకున్నాడు అల్లరి నరేష్. ఆ తరువాత కామెడీ సినిమాతోనే ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈమధ్య నాంది, ఉగ్రం లాంటి సీరియస్ కథలతో మెప్పించి ఇప్పుడు మళ్ళీ కామెడీ సినిమాతో వస్తున్నారు. మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆ ఒక్కటీ అడక్కు అనేే టైటిల్ తో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. మే 3వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ పనులతో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. కామెడీ ఎలిమెంట్స్ తో ట్రైలర్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న అల్లరి నరేష్ తన తరువాత ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. సుడిగాడు 2 కథ నేనే రాస్తున్నాను. త్వరలోనే అది పూర్తి చేసి వచ్చే సంవత్సరం ఆ సినిమా వచ్చేలా చూస్తాను అని తెలిపారు. ఇక అల్లరి నరేష్ తనే కథ రాస్తున్నానని చెప్పడంతో మరింత ఆసక్తి నెలకొంది. మరి సుడిగాడు సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈసినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుండగా హర్ష చెముడు, అరియానా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను చిలక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =