ఎన్టీఆర్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్30 సినిమా గురించి. కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమాన తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటినుండో ఎదురుచూస్తుండగా.. రీసెంట్ గానే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక ఇన్ని రోజులు కొరటాల శివ షూటింగ్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు. ఈనేపథ్యంలోనే ఈసినిమాకు పనిచేస్తున్న హాలీవుడ్ టెక్నీషియన్స్ ను సైతం పరిచయం చేశాడు. ఈసినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ను తీసుకున్నారు. ఇక ఇప్పుడు విఎఫ్ఎక్స్ కోసం మరో హాలీవుడ్ టెక్నీషియన్ బ్రాడ్ మిన్నిచ్ తీసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టారు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ఈవిషయాన్ని తెలియచేస్తూ ఒక చిన్న వీడియో షేర్ చేశారు. ఎన్టీఆర్ కూడా కొరటాల శివతో మళ్లీ సెట్స్ లోకి రావడం గొప్పగా ఉంది అని ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇక ఎన్టీఆర్ దీనిపై అభిమానులు స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
Great to be on sets again with Koratala Siva ! pic.twitter.com/uKNFNtKyZO
— Jr NTR (@tarak9999) April 1, 2023
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: