ఐమ్యాక్స్ 3డీ వర్షన్ లో జై హనుమాన్

jai hanuman will release in imax 3d version

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో పెద్ద సంచలనం సృష్టించిన సినిమా హనుమాన్ మూవీ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఇక రిలీజ్ అయి ఈసినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేసిందో చూశాం. కలెక్షన్స్ కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఇక ఈసినిమా రిలీజ్ అయి 100 రోజులు కూడా పూర్తి చేసుకుంది. దీంతో చిత్రయూనిట్ 100 రోజుల సెలబ్రేషన్స్ కూడా చేసుకోనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. జై హనుమాన్ అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించే పనిలో ఉంది. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి ప్రీ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా నేడు హనుమాన్ జయంతి సందర్భంగా తాజాగా ఈసినిమా నుండి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. తమ మూవీని ఐమ్యాక్స్ 3డీ వర్షన్ లో కూడా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

కాగా మొదటి పార్ట్ ఘన విజయం సాధించడంతో ఇప్పుడు ఈసినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి.
మరి ఈసినిమా ఉంటుందో.. ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − three =