టాలీవుడ్ లో రీ రిలీజ్ ల జోరు కొనసాగుతుంది. హీరోల బర్త్ డే లనే కాదు సందర్భంతో పనిలేకుండా ఈ రీ రిలీజ్ లు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా ఆరెంజ్ సినిమా ను మళ్ళీ విడుదలచేయగా మంచి వసూళ్లను రాబట్టుకుంది. ఈసినిమా తరువాత నితిన్ ,ఇష్క్ రిలీజ్ అయ్యింది. త్వరలోనే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా దేశముదురు ,సీనియర్ హీరో కృష్ణ బర్త్ డే సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సింహాద్రి రీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక ఈజాబితాలో మరో చిత్రం కూడా చేరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదే ఏదో కాదు టీవీ, ఓటిటి లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈనగరానికి ఏమైంది?. పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2018లో విడుదలైంది. అయితే కమర్షియల్ గా అంత వర్క్ అవుట్ కాలేదు కానీ టీవీలో అలాగే ఓటిటి లో విడుదలయ్యాక ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. ఇక ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ విడుదలకానుంది. కానీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలేదు.
ఈ విషయాన్ని తరుణ్ భాస్కర్, ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈసారైనా మీగ్యాంగ్ తో థియేటర్ కు వస్తారా ,మాటిచ్చాను,వెయిట్ చేయండి రీ రిలీజ్ కోసం అంటూ తరుణ్, ట్వీట్ చేశాడు. నలుగురు స్నేహితుల మధ్య జరిగే కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్,అభినవ్ గోమఠం,సుశాంత్ రెడ్డి ,వెంకటేష్ కాకుమాను లీడ్ రోల్స్ లో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై సురేష్ బాబు నిర్మించారు. మరి మళ్ళీ థియేటర్లలో రిలీజ్ కానున్న ఈచిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: