వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఫిబ్రవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్ మొదటి స్ట్రయిట్ తెలుగు సినిమా కావడంతో ఈసినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఆ అంచనాల కు ఏమాత్రం తగ్గకుండా ఈసినిమా మొదటి షో నుండే మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటివరకూ లవ్ స్టోరీస్ తో అలరించిన వెంకీ మొదటిసారి మెసేజ్ ఒరియెంటెడ్ తో వచ్చాడు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరిగే మోసాల గురించి తెలియచేస్తూ ఈసినిమాను రూపొందించాడు. ఇక ధనుష్ కూడా తన నటనతో ఆకట్టుకన్నాడు. ప్రస్తుతం ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మూడు రోజుల్లో రెండు వెర్షన్స్ లో కలిసి 50 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా మంచి విజయం అందించడంతో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. ఇక ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు ఆర్ నారాయణ మూర్తి. ఈసందర్భంగా ఆయన మాట్లాడతూ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో సార్ సినిమా యొక్క గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు నటించిన బడి పంతులు, ఇటీవల హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 తరువాత సార్ సినిమా తనకు అంత బాగా నచ్చిందని, విద్యావ్యవస్థలో కొందరు చేస్తున్న అకృత్యాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన విధానం బాగుందని అన్నారు. ఇంత గొప్ప సినిమా చేయడానికి ముందుకు వచ్చిన హీరో ధనుష్ కి ప్రత్యేకంగా అభినందనలు.. నిజానికి ఇటువంటి సినిమా తీయాలంటే గుండె ధైర్యం కావాలని, దర్శకడు వెంకీ నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య ఎంతో గొప్పగా అలోచించి దీనిని రూపొందించినందుకు హ్యాట్సాఫ్ అని అన్నారు.
కాగా ఈసినిమాలో ధనుష్ కు జోడీగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇంకా సముద్రఖని, సాయికుమార్,తనికెళ్ల భరణి , హైపర్ ఆది తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మించారు. ఇక ఈసినిమాకు జి.వి. ప్రకాష్‌కుమార్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా దినేష్ కృష్ణన్ పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: