ప్రభాస్ 1000 కోట్ల బిజినెస్

Pan India Star Prabhas To Do Rs 1000 Cr Business,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Pan India Star Prabhas To Do Rs 1000 Cr Business,Prabhas Upcoming Movie,Prabhas Latest Movie,Prabhas Movie Updates,Prabhas Latest Movie News,Prabhas Upcoming 1000 Cr Business,Prabhas Coming With 1000 Cr Business New Movie,Prabhas To Do Rs 1000 Cr Business,Prabhas Upcoming Movie 1000 Cr Business,Prabhas Latest Movie 1000 Cr Business,Prabhas Latest Movie News 1000 Cr Business

కృష్ణంరాజు వారసత్వంతోనే ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈశ్వర్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ప్రభాస్ హీరోగా నిలదొక్కుకొని ఆ తరువాత స్టార్ హీరోగా.. స్టార్ హీరో నుండి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో చూస్తున్నాం. ఈ స్థాయికి రావడానికి ప్రభాస్ కూడా ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే పాన్ ఇండియా స్టార్ గా పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అయితే ప్రభాస్ చేసే సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఓం రౌత్ తో ఆదిపురుష్ సినిమా, ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. నాగ్ అశ్విని దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇంకా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా ఉంది.. అలానే సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కూడా లిస్ట్ లో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ప్రస్తుతం ప్రభాస్ తో 1000 కోట్ల బిజినెస్ లైన్ లో ఉంది. ప్రభాస్ నుండి త్వరలో రాబోతున్న సినిమా ఆదిపురుష్. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవ్వడంతో రిలీజ్ డేట్ వాయిదా పడింది. జూన్ 16వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈసినిమా తరువాత రాబోతున్న సినిమా సలార్. ఈసినిమాను కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ కెరీర్ లోనే ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ గా ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాను కూడా దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈసినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అంటే దాదాపు ప్రభాస్ ఒక్కడి మీదే 1000 కోట్ల వరకూ సినీ బిజినెస్ నడుస్తుంది. మరి సినిమా విజయాల సంగతి పక్కన పెడితే ప్రభాస్ ఒక్కడి మీదే ఇన్ని కోట్ల రూపాయల ఒక్క బిజినెస్ అంటే గొప్ప విషయమనే చెప్పాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 17 =