పరదా తొలగించిన అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran's Paradha Movie Concept Video Released

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే ‘టిల్లు స్క్వేర్’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో అప్పుడే ఆమె తాన్ తదుపరి చిత్రాన్ని కూడా ప్రారంభించేసింది. ఈ సినిమాకు ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో మరో ప్రముఖ మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్ తొలిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే సీనియర్ నటి సంగీత కీలక పాత్రలో నటించనున్నారు. కాగా ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి మరియు శ్రీధర్ మక్కువతో కలిసి నిర్మాత విజయ్ డొంకాడ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా ‘పరదా’ చిత్రం నుంచి ఒక క్రేజీ అప్డేట్ అందించారు మేకర్స్. శుక్రవారం ఈ మూవీ కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేశారు. స్టార్ హీరోయిన్ సమంత మరియు దర్శకద్వయం రాజ్-డీకే చేతులమీదుగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మరియు కాన్సెప్ట్ వీడియోని ఆవిష్కరించడం విశేషం. ఈ సందర్భంగా అనుపమ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాంప్రదాయ దుస్తులలో, మరికొందరు అమ్మాయిలతో పాటు అనుపమ నిలబడి కనిపిస్తుంది. ఆమె గత సినిమాలోలా కాకుండా ఇందులో డి-గ్లామ్ పాత్రలో కనిపించనున్నట్లు అర్ధమవుతోంది.

ఇక కాన్సెప్ట్ వీడియోను గమనిస్తే.. విలేజ్ సెటప్‌లో భారీ దేవతా విగ్రహం కనిపిస్తుంది. కొందరు మహిళలు పూజించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా శ్లోకం- యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలాః క్రియా, మనుస్మృతిలోని ప్రసిద్ధ శ్లోకం వినబడుతుంది. స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో, అక్కడ దైవత్వం వికసిస్తుంది మరియు స్త్రీలు ఎక్కడ అవమానించబడతారో, అన్ని కార్యాలు ఎంత గొప్పగా ఉన్నా ఫలించదు అని అర్థం. శ్లోకం సినిమా ఇతివృత్తాన్ని వివరిస్తుంది.

ఇక పరదా గ్లింప్స్ రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. టైటిల్ గ్లింప్స్ తోనే ఇదేదో కొత్త కథ అనే ఆసక్తిని క్రియేట్ చేయగలిగింది చిత్రబృందం. కాగా ప్రస్తుతం ఈ చిత్రం ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలోని కొన్ని గ్రామాలలోని సుందరమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక పరదా చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా.. మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ, ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − seven =