ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నరామ్ చరణ్ ఇప్పుడు ‘RC 15’ పై తన ఫోకస్ మొత్తం పెట్టాడు. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒక స్టార్ హీరో ఒక లెజెండరీ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మరోవైపు అభిమానులు ఈసినిమా గురించి అప్ డేట్ ఎప్పుడిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలో తాజాగా దిల్ రాజు ఈసినిమా గురించి అప్ డేట్ ఇచ్చాడు. తాజాగా గ్రాండ్ మెగా కార్నివాల్ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు ఆర్సీ 15 గురించి మాట్లాడుతూ.. తొందరలోనే మీరందరూ 15 అప్ డేట్ గురించి కోరుకుంటున్నారు. ఈమధ్యనే మీ అభిమానులందరూ నన్ను ట్విట్టర్ లో ఆడుకుంటున్నారని.. ఈరోజు మీరు ట్రెండింగ్ లో ఉన్నారని.. చెన్నై నుండి నాకు లింక్ పంపారు.. ఎంట్రా అని చూస్తే RC15 అప్ డేట్ గురించి అని అర్థమైంది. శంకర్ గారిని అడిగాను.. సార్ తొందరలోనే మీరు ఏదో ఒక అప్ డేట్ ఇవ్వాలి.. ఫ్యాన్స్ మిమ్మల్ని అడగలేరు.. నన్ను అడుగుతున్నారని.. తొందరలోనే ఆయన దానికి సంబంధించిన అప్ డేట్ ఇంకా ఫస్ట్ లుక్ అప్ డేట్ ఇస్తారని అనుకుంటున్నాను అంటూ చెప్పారు.
A delightful news for all the fans! 🔥
Major updates of #RamCharan‘s #RC15 to be released soon….. Stay Tuned! 💥💥@AlwaysRamCharan @advani_kiara @shankarshanmugh @MusicThaman #DilRaju @SVC_official #TeluguFilmNagar pic.twitter.com/r54oKm9MW7— Telugu FilmNagar (@telugufilmnagar) August 22, 2022
కాగా కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: