కార్తికేయ 2 మూవీ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

Powerstar Pawan Kalyan appreciates Karthikeya 2 Movie,Powerstar Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan Latest News,Pawan Kalyan Live,Pawan Kalyan Press Meet,Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Movie Updates,Pawan Kalyan Appreciates Karthikeya 2 Movie,Pawan Kalyan Praises Karthikeya 2 Movie,Pawan Kalyan About Karthikeya 2 Movie,Pawan Kalyan About Karthikeya 2 Movie Response,Nikhil Siddhartha,Nikhil Movies,Nikhil Karthikeya 2,Karthikeya 2 Movie Collections,Karthikeya 2 Movie Response,Pawan Kalyan Reviews Karthikeya 2 Movie

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా ఈ మూవీ అద్భుత రెస్పాన్స్ అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేశవ్యాప్తంగా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కార్తికేయ-2 మూవీ పై ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కార్తికేయ-2పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా ఇండస్ట్రీలో తాను కోరుకున్న మార్పును కార్తికేయ-2 సినిమా సాధిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందనీ , ఇండియన్ బాక్సాఫీస్‌ను కార్తికేయ-2 చెడుగుడు ఆడుకోవడం అందరికీ గర్వకారణంగా ఉందనీ , నిఖిల్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిన తీరు అద్భుతం అనీ పవన్ చెప్పారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా గురించి, తన గురించి మాట్లాడటం తాను నమ్మలేకపోతున్నాననీ , కార్తికేయ-2 సినిమాపై పవన్ ప్రశంసలకు తామెప్పటికీ రుణపడి ఉంటామని నిఖిల్ ట్వీట్ చేశారు. పవన్ మాట్లాడిన ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =