అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు నాగచైతన్య. క్లాస్, మాస్, లవ్ స్టోరీలు ఇలా ఏసినిమా అయినా చేయగలనని నిరూపించుకున్నాడు. అంతేకాదు డిఫరెంట్ కథలతో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే తను నటిస్తున్న థాంక్యూ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇంకా తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా లాల్ సింగ్ చద్దా సినిమా చేస్తున్నాడు. ఈసినిమా కూడా త్వరలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు కూడా. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ వివరాలను కూడా వరుసగా అప్ డేట్లు ఇస్తూ తెలియచేస్తున్నారు. ఈరోజు ఉదయమే ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ తరువాత సంగీత దర్శకులుగా మ్యూజికల్ మ్యాస్ట్రో ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా పనిచేస్తున్నట్టు అధికారికంగా తెలియచేశారు. ఇక ఈసినిమాను గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి బోయపాటి శ్రీను, రానా దగ్గుబాటి ఇంకా శివ కార్తికేయన్ కూడా హాజరయ్యారు. బోయపాటి శ్రీను ఫస్ట్ క్లాప్ ఇవ్వగా రానా కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
An Auspicious start to the Most Exciting Journey🔥
Elated to Kickstart the ambitious #NC22 with a Pooja Ceremony 🪔
Clap 🎬 by #BoyapatiSreenu
Camera🎥 switch on by @RanaDaggubati#NC22Begins #VP11 @chay_akkineni @vp_offl @IamKrithiShetty @Ilaiyaraaja @thisisysr @SS_Screens pic.twitter.com/VZXfm5C2VF
— Srinivasaa Silver Screen (@SS_Screens) June 23, 2022




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: