అక్కినేని వారసత్వంలో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. ఇక తన సినిమాలతో ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పటివరకూ బాగానే హిట్లను అందుకున్నాడు. ఇక ఇప్పుడు తన నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి సాలిడ్ అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. క్రిస్మస్ పండుగను టార్గెట్ చేసి ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.
కాగా ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: