మిస్టర్ బచ్చన్- అయోధ్యలో రామ్ లల్లా బ్లెస్సింగ్స్ తీసుకున్న టీమ్

director harish shankar visited ayodhya ram mandir

మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ చేయగా ఈ ఏడాది అప్పుడే ఈగల్ అంటూ వచ్చేశాడు. ఈసినిమా డీసెంట్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. గత కొద్ది రోజులుగా ఉత్తర ప్రదేశ్ లో ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. దాదాపు 30 రోజుల పాటు ఈ కీలక షెడ్యూల్ జరగగా అక్కడ చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ఈ లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ తో పాటు చిత్రయూనిట్ అయోధ్య వెళ్లి రామ్ మందిరాన్ని సందర్శించారు. అక్కడ రామ్ లల్లా బ్లెస్సింగ్స్ ను తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్రనిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

కాగా ఈసినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 2 =