బాణం, సోలో, ప్రతినిధి, అసుర వంటి సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు రోహిత్. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా వస్తున్న సినిమా ప్రతినిధి2. ఈసినిమా ప్రతినిధి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా మ్యూజిక్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. గల్లా ఎత్తి అంటూ వచ్చే మొదటి పాటను తాజాగా రిలీజ్ చేశారు. ఎనర్జిటిక్ గా ఉన్న ఈ మాస్ సాంగ్ అయితే ఆకట్టుకుంటుంది. సమాజంలో మంచి చెడుల గురించి ఆలోచింపజేసేలా ఉంది ఈపాట. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈపాటకు రామ్ మిరియాల ఆలపించారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ లో నారా రోహిత్ ఉత్సాహంగా డాన్స్ చేశాడు.
Groove to the energizing beats of #GallaYetthi song from #Prathinidhi2 now!
A @SagarMahati Musical. @ram_miriyala
@murthyscribe #Prathinidhi2onApril25th
— Rohith Nara (@IamRohithNara) April 16, 2024
కాగా ఈసినిమాలో సిరీ లెల్లా హీరోయిన్ గా నటిస్తుండగా.. దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వానర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈసినిమాను కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: