పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన మనోజ్ దంపతులు

Manoj Manchu and Bhuma Mounika are blessed with a baby girl

మంచు వారి ఇంట ఆనందం నెలకొంది. మంచు మనోజ్ గత ఏడాది భూమా మౌనికను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తండ్రిగా కూడా ప్రమోట్ అయ్యాడు. మంచు మనోజ్ భార్య భూమా మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ విషయాన్ని మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇప్పుడు వారు నలుగురు అయ్యారు.. దేవుళ్ల ఆశీర్వాదంతో దేవత వచ్చింది. మనోజ్, మౌనిక ఎంతగానో ఎదురుచూస్తున్న బేబి గార్ల్ ను పొందారని అనౌన్స్ చేయడానికి చాలా థ్రిల్లింగ్ గా ఉంది.. అన్న అయినందుకు ధైరవ్ ఆనందానికి అవధుల్లేవు. ఆమెను మేము ముద్దుగా ఎంఎం పులి అని పిలస్తున్నాము అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మంచు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో మనోజ్. కెరీర్ మొదట్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈమధ్య సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత కొత్త సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో మనోజ్ హీరోగా వస్తున్న సినిమా వాట్ ద ఫిష్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమాను ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఇప్పటికే పలు పోస్టర్లు అలానే గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. కాగా ఈసినిమాను 6ix సినిమాస్ ఇంకా afilmbyv బ్యానర్స్ పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 1 =