జితేందర్ రెడ్డి నుండి లచ్చిమక్కా- అర్చనక్కా కలర్ ఫుల్ సాంగ్ రిలీజ్

lachimakka lyrical song out from jithender reddy movie

బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా నుండి అ ఆ ఇ ఈ ఉ ఊ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సాంగ్ బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా మరో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. లచ్చిమక్కా.. అర్చనక్కా అంటూ వచ్చే పాటను రిలీజ్ చేశారు. లచ్చిమక్కా.. అర్చనక్కా పిల్ల సూడండే సిగ్గులల్ల సీతలెక్క సక్కగున్నాదే అంటూ పెళ్లి బ్యాక్ డ్రాప్ లో కలర్ ఫుల్ ఉన్న ఈసాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. ఈ పాటకి గోపి సుందర్ మ్యూజిక్ అందించగా రాంబాబు గోసాల లిరిక్స్ రాశారు. మంగ్లీ ఈ పాటని చాలా బాగా పాడారు.

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ముదిగంటి రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ: ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరుకు రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ అన్ని కూడా మంచి ఆదరణ పొందాయి. ప్రేక్షకులు కొత్త నిర్మాతలమైనా మనల్ని ఇంత బాగా ఆదరిస్తున్నారు. కంటెంట్ ఉంటే మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆ సినిమాని ఆదరిస్తారు అని మరోసారి నిరూపించారని అన్నారు.

కాగా ఈసినిమా లో వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈసినిమాను నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు ఎస్. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 3 =