టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం కెరీర్ ను బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈమధ్యనే ఆశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. మొదటి నుండి కాస్త మాస్ పాత్రల్లో చేసిన విశ్వక్ సేన్ ఈసినిమాలో కూల్ గా సెటిల్డ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ తో బిజీ అవుతున్నాడు. రీసెంట్ గానే సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా సినిమా వస్తున్నట్టు అధికారికంగా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. మొదటి నుండి భారీగానే మొదలైన ఈసినిమాకు ఇప్పుడు ఏకంగా పవన్ నే రంగంలోకి దించారు. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పవన్ ఫస్ట్ షాట్ కి క్లాప్ కొట్టి చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అందించారు. ఇప్పుడు ఈ ఫోటోలు మాత్రం మంచి వైరల్ గా మారిపోయాయి. ఇక ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పవన్-ప్రకాష్ రాజ్ కు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ గా మారాయి. ప్రకాష్ రాజ్ తో పవన్ డీప్ గా ఏదో చర్చిస్తున్నట్టు ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. దీంతో ఇద్దరూ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారమో అని కూడా కామెంట్స్ చేస్తున్నారు.
Power 🌟 #PawanKalyan and #PrakashRaj in a close conversation at the movie launch of #VishwakSen & #ArjunSarja!! ❤️❤️@PawanKalyan @prakashraaj #TeluguFilmNagar pic.twitter.com/NHeZfDMWkF
— Telugu FilmNagar (@telugufilmnagar) June 23, 2022
కాగా ఈసినిమాలో అర్జున్ కూతురు ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక అర్జున్ ఈసినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. శ్రీ రామ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ‘కేజీఎఫ్’ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: