చాలా గ్యాప్ తరువాత నారా రోహిత్ ఇప్పుడు కొత్త సినిమాతో వస్తున్నాడు. జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా వస్తున్న సినిమా ప్రతినిధి2. ఈసినిమా ప్రతినిధి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. 2014లో నారా రోహిత్ హీరోగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ప్రతినిధి ఈసినిమా మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఇప్పుడు సీక్వెల్ తో వస్తున్నారు. దీంతో ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 25వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు మరో అప్డేట్ కూడా ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా థియేట్రికల్ రైట్స్ ను అమోఘా ఎంటర్ టైన్ మెంట్స్ వారు సొంతం చేసుకున్నట్టు తెలిపారు.
#Pratinidhi2 worldwide theatrical release rights acquired by @AmoghaEnter ❤️🔥
Worldwide grand release at theatres near You on APRIL 25th! 🔥#Prathinidhi2OnApril25th 💥@IamRohithNara @murthyscribe @SagarMahati @TSAnjaneyulu1 @Nchamidisetty @Kumarraja423 @VanaraEnts #RanaArts pic.twitter.com/AlhCjiKDVv
— Vanara Entertainments (@VanaraEnts) April 13, 2024
కాగా వానర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈసినిమాను కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: