కమర్షియల్ హిట్ “పెళ్ళిసందD “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన శ్రీలీల , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ ను శ్రీలీలే అందుకుంటున్నారు. శ్రీలీల ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న “ధమాకా ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చున్ 4 సినిమాస్ బ్యానర్స్ పై కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న “అనగనగా ఒకరాజు”, వారాహి చలన చిత్ర బ్యానర్ పై రాధాకృష్ణ దర్శకత్వంలో గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న మూవీస్ లో శ్రీ లీల కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ , శ్రీలీల జంటగా ఒక మూవీ తెరకెక్కుతుంది. హీరో రామ్ , బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కే మూవీ లో శ్రీ లీల కథానాయికగా ఎంపిక అయ్యే అవకాశం ఉంది. తన క్యూట్ లుక్స్ , అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శ్రీలీల కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.