థగ్ లైఫ్- మళ్లీ వచ్చిన స్టార్ హీరోలు

two star heros back for kamal haasans thug life movie

లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన నాయకుడు సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో సినిమాపై ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈసినిమాలో ముందుగా మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, ఇంకా తమిళ్ స్టార్ హీరో జయం రవి కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే మధ్యలో వీరిద్దరూ సినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు వారి స్థానంలో వేరే హీరోలను తీసుకోనున్నట్టు కూడా కథనాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ ఈసినిమాలోకి తిరిగి వచ్చినట్టు కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి చూద్దాం దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా..ఇంకా ఐశ్వర్య లక్ష్మీ, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్ కూడా నటిస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా కమల్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రవి కె చంద్రన్.. ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 7 =