మనమే టీజర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

sharwanand manamey movie teaser time fixed

కొంత గ్యాప్ తరువాత ప్రస్తుతం యంగ్ హీరో శర్వానంద్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా మనమే. ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. మరోవైపు మ్యూజికల్ జర్నీని కూడా స్టార్ట్ చేసారు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయగా ఆ పాటకు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ పై రెండు రోజుల క్రితమే కృతిశెట్టి అప్ డేట్ అడుగుతున్నట్టు ఒక చిన్న వీడియోను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇప్పుడు ఈసినిమా టీజర్ గురించి అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా టీజర్ ను రేపు అంటే ఏప్రిల్ 19వ మధ్యాహ్నం 12గంటల 34 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eight =