టీఆర్పీ రేటింగ్స్ లో అదరగొట్టిన గుంటూరు కారం 

guntur kaaram gets solid trp ratings

సూపర్ స్టార్ మహేష్ బాబు ,స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబో లో వచ్చిన మూడో సినిమా గుంటూరు కారం.ఈసంక్రాంతికి భారీ అంచనాలతో విడుదలైన ఈసినిమా 100కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది. ఇక థియేట్రికల్ రన్ తరువాత ఓటిటి లోకి రాగ అందులో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక రీసెంట్ గా టీవీ ప్రీమియర్ లో కూడా అదరగొట్టింది.ఈ ఉగాది కానుకగా ఈనెల 7న ఈ సినిమాను జెమినీ టీవీ మొదటి సారి ప్రసారం చేయగా ఏకంగా 9.23 రేటింగ్స్ ను సొంతం చేసుకుంది.ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు సరైన రేటింగ్స్ రావడం లేదు. ఓటిటి ప్రభావం ఎక్కువగా ఉండడంతో చాలా సినిమాలు నార్మల్ రేటింగ్స్ ను రాబట్టుకుంటాయి కానీ గుంటూరు కారం మాత్రం ఓటిటి అలాగే ఐపీఎల్ ను తట్టుకొని సాలిడ్ రేటింగ్స్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు వల్ల జెమినీ టీవీ టాప్ 5 ఛానళ్లలో నాలుగో స్థానం లోకి వచ్చింది.మొత్తానికి మహేష్ స్టార్ డమ్ తో జెమినీ కూడా మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది.ఫ్యామిలీ ఎంటర్టైనెర్ గా వచ్చిన గుంటూరు కారంలో ప్రకాష్ రాజ్,రమ్యకృష్ణ,జయరామ్ కీలక పాత్రల్లో కనిపించారు.తమన్ సంగీతం అందించగా హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించింది.

ఇక గుంటూరు కారం తరువాత మహేష్ బాబు ,టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తన 29వ సినిమా చేయనున్నాడని తెలిసిందే.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో వున్న ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.అయితే అధికారికంగా ఇప్పటివరకు ఈసినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు. మహేష్ బర్త్ డే రోజైన ఈ సినిమా గురించి ఏమైనా అప్డేట్ వస్తుందో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − one =