ఈమధ్య పాటలతోనే సినిమాపై మంచి క్రేజ్ ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. మరీ ముఖ్యంగా థమన్ అయితే తన పాటలతోనే సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ చేసేస్తున్నాడు. అల వైకుంఠపురం నుండి మొదలైన థమన్ హవా ఉంకా నడుస్తూనే ఉంది. రీసెంట్ గా భీమ్లానాయక్ సినిమా పాటలు ఏ రేంజ్ లో జనాల్లోకి ఎక్కాయో చూశాం. ఇక ఇప్పుడు థమన్ సంగీతం అందిస్తున్న సర్కారు వారి పాట సినిమా పాటలు కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది.. ఈసినిమా నుండి మొదట రిలీజ్ అయిన కళావతి పాట ఇప్పటికే 100 మిలియన్ కోట్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి రెండో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. పెన్నీ సాంగ్ అంటూ రిలీజ్ అయిన ఈ పాట కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. అయితే ఈపాటలో స్పెషల్ ఎట్రాక్షన్ సితార పాప. ఈపాట తో ఎంట్రీ ఇచ్చిన సితారను చూసి అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక సితారపై కూడా ప్రశంసలు కురిపించారు. ఈనేపథ్యంలో తాజాగా సితార కూడా తన సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పింది.
కాగా ఈసినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సర్కారు వారి పాట సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: