టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా కృష్ణమ్మ. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అయ్యింది. మే 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ మూవీ ప్రమోషన్స్ లో స్పీడు పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. విలేజ్ బ్యాక్‌డ్రాప్, పోలీసు కేసు చూట్టు తిరిగిన ఈ ట్రైలర్ అయితే ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. ఓ కేసులో సత్యదేవ్‌ను ఇరికించినట్లుగా ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది. దాన్ని నుంచి అతడు ఎలా బయటపడ్డాడు. అసలు ఆ కేసు ఏంటి ? అతడినే ఎందుకు ఇరికించారు? అనేది ఈసినిమా కథగా తెలుస్తుంది. కథ నడకకైనా, నది నడకకైనా మలుపులే అందం. కానీ కొన్ని మలుపుల్లో సుడులు ఉంటాయి…ఇన్నాళ్లు ఎప్పుడు పుట్టాము, ఎవరికి పుట్టామో తెలియక పోవడమే బాధ అని అనుకున్నాను.. కానీ..ఎందుకు చనిపోతున్నామో, ఎవడి చేతుల్లో చనిపోతున్నామో తెలియకపోవడం అసలైన బాధ అంటూ సత్యదేవ్ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచుతుంది.
The Riveting and Intense trailer of #Krishnamma out now 💥
Witness the tale of Friendship & Revenge on the big screens ❤️🔥
▶️https://t.co/Z0ifTq8fpu#Krishnamma GRAND RELEASE ON 𝐌𝐀𝐘 𝟏𝟎𝐭𝐡 by @mythrireleases & @Primeshowtweets 💥⭐️ing @ActorSatyaDev #VVGopalakrishna… pic.twitter.com/7VTym0MnGC
— Telugu FilmNagar (@telugufilmnagar) May 1, 2024
ఇంకా ఈసినిమాలో లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాలబైరవ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: