పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలని ఇందులో చూపించాం – అల్లరి నరేష్

Aa Okkati Adakku Pre Release Event Allari Naresh Interesting Comments on Film

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‍గా నటిస్తోంది. స్టార్ రైటర్ అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. ఇక అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేయగా.. మే 3న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. హీరో అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరవగా.. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను ఈ స్టేజ్‌లో, ఇన్ని సంవత్సరాలు పరిశ్రమలో ఉన్నానంటే కారణం మా నాన్నగారు. ఆయన ఉన్నన్ని రోజులు నాతో సినిమాలు చేసి, హిట్లు ఇచ్చి, నన్ను సక్సెస్ ఫుల్ యాక్టర్‌ని చేశారు. ఆయన లేనప్పుడు కూడా ఆయన టైటిల్ ఇచ్చి ఈ సినిమాతో బ్లెస్ చేస్తున్నారు. ఇది బరువుగా, భాద్యతగా ఫీలౌతున్నాను. తప్పకుండా ఆ మంచి పేరుని కాపాడతానని మాటిస్తున్నాను” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ వేడుకకు వచ్చిన హీరో అడివి శేష్ గారికి, రవి గారికి, విజయ్ కనకమేడల, విజయ్ బిన్నీ, దేవాకట్టా గారికి పేరుపేరునా ధన్యవాదాలు. దర్శకుడిగా మల్లి అంకంకు ఇది మొదటి సినిమా. చాలా కాలంగా దర్శకుడు కావాలనే కలగని, ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశారు. ఇప్పటివరకు దాదాపు 32 మంది కొత్త దర్శకులని పరిచయం చేశాను. 31 మంది రిలీజ్‌కి ముందు టెన్షన్ పడ్డారు. ఒక్క మల్లి గారు మాత్రం చాలా కూల్‍గా నవ్వుతూ వున్నారు (నవ్వుతూ). అసలు టెన్షన్ అనే మాటే ఆయన డిక్షనరీలో లేదు. నిజంగా అది గ్రేట్ గిఫ్ట్” అని అన్నారు.

“ఈ సినిమాతో పరిశ్రమకి రాజీవ్ గారు లాంటి మంచి నిర్మాత పరిచయం అవుతున్నారు. ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం. ఈ సినిమా పెద్ద విజయం సాధించి, ఆయన మరో పది చిత్రాలు నిర్మించి, గోపిసుందర్ గారు నాలుగు బ్యూటీఫుల్ సాంగ్స్ ఇచ్చారు. అబ్బూరి రవి గారు, చోటా ప్రసాద్ గారు దాదాపు ఐదారు సినిమాల నుంచి ఒక ఫ్యామిలీలా వర్క్ చేస్తున్నాం. ఈ సినిమాలో సాంగ్స్ చేసిన భాను మాస్టర్, రాజుసుందరం మాస్టర్, విజయ్ బిన్నీ మాస్టర్, రఘు మాస్టర్ అందరికీ థాంక్స్. భాస్కర భట్ల, రామజోగయ్యశాస్త్రీ గారికి ధన్యవాదాలు” అని చెప్పారు.

“హీరోయిన్ ఫరియా అబ్దుల్లాతో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. తనలో పెక్యులర్ కామెడీ టైమింగ్ వుంది. అది చాలా తక్కువ మందిలో వుంటుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి మా జోడి మరో రెండు మూడు సినిమాలకు కొనసాగాలని కోరుకుంటున్నాను. జామి లివర్ యంగ్ వెర్షన్ అఫ్ కోవై సరళ లాంటి పాత్ర చేశారు. తన పాత్ర చాలా బావుటుంది. తనకి టాలీవుడ్ కి స్వాగతం. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని తెలిపారు.

“మే3న సినిమా విడుదల కాబోతుంది. ఈ మండు వేసవి మీ బాధలు మర్చిపోయి ఒక రెండు గంటలు హాయిగా ఈ సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. ఈ సినిమా పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి అయినవారు, పెళ్లి సంబంధాలు చూస్తున్నవారు, ప్రతిఒక్కరూ చూడాలి. కామెడీ సినిమా చేసిన, సీరియస్ సినిమా చేసినా కంటెంట్ వున్న సినిమా చేస్తాను. ఈ సినిమా ఆర్గానిక్ కామెడీ. ఇందులో పెళ్లిపేరుతో జరుగుతున్న మోసాలని అందరికీ తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. మే3న థియేటర్స్ రండి అందరూ సరదాగా నవ్వుకోండి” అని అన్నారు హీరో అల్లరి నరేష్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.