దేశవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమాల్లో కె.జి.యఫ్ 2 సినిమా కూడా ఒకటి. ఈసినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. అయితే ఎన్నో సినిమాలు రిలీజ్ డేట్లు మార్చుకున్న నేపథ్యంలో ఈసినిమా రిలీజ్ డేట్ కూడా మారుతుందిలే అనుకున్నారు కానీ.. ఇప్పటివరకూ మాత్రం అదే రిలీజ్ డేట్ ను ఉంచారు. మరి రిలీజ్ లోపు ఇదే డేట్ ఉంటుందా లేక వేరే డేట్ మారుతుందా అన్న అనుమానాలు కూడా ఇంకా ఉన్నాయి. ఇక మరోవైపు ప్రమోషన్స్ విషయంలో మాత్రం మేకర్స్ కాస్త స్లోగానే ఉన్నారని చెప్పొచ్చు. ఈసినిమా నుండి ఇప్పటి వరకూ పలు పోస్టర్లు వచ్చాయి. టీజర్ కూడా ఎప్పుడో రిలీజ్ అయింది. అంతేతప్పాా సాలిడ్ అప్ డేట్ వచ్చి మాత్రం చాలా రోజులైంది. ఇక ఎన్నో రోజుల నుండి మంచి అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న కె.జి.యఫ్ అభిమానుల కోసం ఓ సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈసినిమా ట్రైలర్ కు డేట్, టైమ్ ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. మార్చి 27న సాయంత్రం 6గంటల 40 నిమిషాలకు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్.
There is always a thunder before the storm ⚡#KGFChapter2 Trailer on March 27th at 6:40 pm.
Stay Tuned: https://t.co/QxtFZcv8dy@Thenameisyash @prashanth_neel@VKiragandur @hombalefilms @HombaleGroup @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7
#KGF2TrailerOnMar27 pic.twitter.com/4TBuGaaUKh— Hombale Films (@hombalefilms) March 3, 2022
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా వస్తున్న సినిమా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’. గతంలో వచ్చిన ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’ సంచలనాలు క్రియేట్ చేయడంతో ఈ సీక్వెల్ పై అదే స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, ఇంకా రావు రమేష్ తో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: