ఒకప్పుడు స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్స్ సైతం ఇప్పుడు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సీనియర్ హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో పలు పాత్రలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ఖుష్బూ కూడా టాలీవుడ్ లో బిజీ అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో నటించిన ఖుష్బూ.. శర్వానంద్ హీరోగా రిలీజ్ కాబోతున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలో కూడా మరో కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు మరో సినిమాలో ఆమె కీలక పాత్ర దక్కించుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇక ఈసినిమాను పూజా కార్యక్రమాలతో ఎప్పుడో లాంచ్ చేశారు మేకర్స్. ఇక నేటి నుండి షూటింగ్ ను ప్రారంబించారు. ఇదిలా ఉండగా ఈసినిమాలో ఖుష్బూ కూడా నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
Team #Gopichand30 is elated to Welcome the Veteran and Ever-Versatile actress @khushsundar garu ONBOARD 🤗
⭐️ing @YoursGopichand
A Film by @DirectorSriwass 🎬
In @peoplemediafcy Production@IamJagguBhai @vishwaprasadtg @vivekkuchibotla pic.twitter.com/KcuCvgSAMy— People Media Factory (@peoplemediafcy) March 3, 2022
కాగా జగపతిబాబు కూడా ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో గతంలో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాలు రాగా ఇప్పుడు వస్తుంది మూడో సినిమా. మరి ఈసినిమాతో వీరిద్దరూ హ్యాట్రిక్ కొడతారో లేదో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: