గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రాధేశ్యామ్ ” మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ భారీగా చేపట్టారు. ముంబై లో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో ప్రభాస్ , హీరోయిన్ పూజాహెగ్డే , దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పాల్గొన్నారు.”రాధేశ్యామ్” సినిమా ట్రైలర్ లో ‘ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు’ అనే డైలాగ్ ఉంది.ప్రెస్ మీట్ లోప్రేమ విషయంలో నిజ జీవితంలో మీ లెక్క ఎన్ని సార్లు తప్పింది’ అని ఒక విలేకరి ప్రభాస్ ను అడగగా చాలా సార్లు.. అందుకే నాకింకా పెళ్లి కావడం లేదనుకుంటా అని టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ , పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫన్నీగా సమాధానమివ్వడంతో అందరూ నవ్వేశారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: