మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు రిలీజ్ చేయగా అందులో భోళా శంకర్ బ్లాక్ బస్టర్ ను అందించగా.. భోళా శంకర్ పరాజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బింబిసార సినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరు హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆవీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈసినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం చిరు కూడా డెడికేషన్ తో వర్క్ చేస్తున్నట్టు ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. గత కొద్దిరోజులుగా ఈసినిమాకు సంబంధించి ఒక భారీ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ భారీయాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు. అయితే విశేషం ఏంటంటే.. ఈ సీక్వెన్స్‌ను దాదాపు 26 రోజుల పాటు చిత్రీకరించారట. మెగాస్టార్ తన కెరీర్లో ఒక్క సీన్ కోసం ఇన్ని రోజులు షూటింగ్ చేయడం కూడా ఇదే మొదటిసారి. ఇక ఈ భారీ ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ అవుతుందంటన్నారు.
కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. ఈసినిమాను వచ్చేే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: