సత్యభామ నుండి ‘కళ్ళారా చూశాలే’ లిరికల్ సాంగ్ రిలీజ్

Kallara Lyrical Song Released From Kajal Aggarwals Satyabhama

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ చాలాకాలం గ్యాప్ తర్వాత గతేడాది ‘భగవంత్ కేసరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఆమె తొలిసారిగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాల‌కృష్ణ‌తో జోడీక‌ట్టింది. దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ సినిమా ఇచ్చిన స‌క్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఆమె ప్రస్తుతం ‘స‌త్య‌భామ’ అనే ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇది కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న 60వ సినిమా కావ‌డం గ‌మ‌నార్హం. ఇందులో కాజ‌ల్‌తో పాటు విలక్షణ నటుడు ప్ర‌కాష్‌రాజ్‌, ట్యాలెంటెడ్ యాక్టర్ న‌వీన్‌చంద్ర కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు. వచ్చే ఏడాది సమ్మర్ హాలిడేస్‌లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సత్యభామ నుంచి ‘కళ్ళారా చూశాలే’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇక ఈ పాటను గేయరచయిత రాంబాబు గోశాల రచించగా.. స్టార్ సింగర్ శ్రేయ ఘోషల్ ఆలపించారు. అలాగే శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందించారు.

కాగా క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకి సుమ‌న్ చిక్కాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుస్తున్నారు. ‘గూఢ‌చారి’ ఫేమ్ శ‌శికిర‌ణ్ తిక్కా స్క్రీన్‌ప్లేతో పాటు నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌ డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్‌ సత్యభామగా కనిపించనుంది. ‘స‌త్య‌భామ’ మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కాజ‌ల్ ఇతర సినిమాల విషయానికొస్తే.. ప్రముఖ తమిళ దర్శకుడు శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ‘ఇండియ‌న్ 2’లో క‌మ‌ల్‌హాస‌న్‌ సరసన హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + nineteen =