ఈ సంక్రాంతికి చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే కదా. టాలీవుడ్ నుండే చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. నిజానికి ఈ సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ చాలా సినిమాలు రేస్ నుండి తప్పుకున్నాయి. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో రాధేశ్యామ్ ఒక్కటే పాన్ ఇండియా రేంజ్ సినిమా. ఇక ఇప్పుడు ఈ రేసులోకి వాలిమై సినిమా కూడా వచ్చింది.ఇక బంగార్రాజు ఇంకా ఒకటి రెండు మిగిలిన సినిమాలు తప్పా అన్నీ దాదాపు చిన్న సినిమాలే. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు వాలిమై పోటీకి దిగుతుంది. రాధేశ్యామ్ జనవరి 14న రిలీజ్ అవుతుండగా ఒక రోజు ముందే అంటే జనవరి 13న ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈవిషయాన్ని మరోసారి మేకర్స్ అధికారికంగా తమ ట్విట్టర్ ద్వారా కన్ఫామ్ చేశారు. రిలీజ్ డేట్ లో ఎలాంటి ఛేంజ్ ఉండదని స్పష్టం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Experience the POWER OF #VALIMAI, in Tamil, Telugu and Hindi. Releasing Worldwide on 13th January 2022.#AjithKumar #HVinoth @thisisysr @BayViewProjOffl @ZeeStudios_ @sureshchandraa @ActorKartikeya #ValimaiFromPongal #ValimaiFromJan13 pic.twitter.com/crMZfBTZFH
— Boney Kapoor (@BoneyKapoor) January 4, 2022
కాగా హెచ్. వినోత్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. బాలీవుడ్ నటి హుమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తుండగా… కార్తికేయ విలన్‌గా చేస్తున్నాడు. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌లో ఈసినిమాను నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. మరి వాలిమై సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. చూద్దాం ఈసినిమా ఏ రేంజ్ లో ఉంటుందో..




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: