శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా వస్తున్న సినిమా రౌడీ బాయ్స్. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నాడు ఆశిష్. అందుకే ఈసినిమా ప్రమోషన్స్ కూడా దిల్ రాజు గట్టిగానే ప్లాన్ చేశాడు. దీనిలో భాగంగానే ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ లను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్సే వచ్చింది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తుంది. ఈ మధ్య నవంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్నా అదీ కుదరలేదు. ఇక ఇప్పుడు మరోసారి రౌడీబాయ్స్ రిలీజ్ ను ఫిక్స్ చేశారు. ఇక ఫైనల్ గా ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘‘రౌడీ బాయ్స్’ పక్కా యూత్ కంటెంట్ మూవీ. ఆల్ రెడీ రౌడీ బాయ్స్ టైటిల్ ట్రాక్, ప్రేమే ఆకాశమైతే అనే పాటలు విడుదలై మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. అలాగే టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా. ఇందులో లవ్ కంటెంట్ ఎలా ఉంటుందనేది సినిమా చూడాల్సిందే. యూత్‌ఫుల్ మూవీ కావడంతో దీనికి రౌడీ బాయ్స్ అనే టైటిల్ పెట్టాం. సంక్రాంతి సందర్భంగా ‘రౌడీ బాయ్స్’ను విడుదల చేస్తున్నాం. డైరెక్టర్ శ్రీహర్ష మంచి టీమ్‌తో యూత్ సహా అందరకీ నచ్చే ఓ ఎంటర్‌టైనింగ్ సినిమాను రూపొందించాడు. అనుపమ మా బ్యానర్లో చేసిన మూడో సినిమా. తను కొత్త అమ్మాయిలా ఒదిగిపోయి యాక్ట్ చేసింది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్ద ఎసెట్ అవుతుందనడంలో సందేహం లేదు. అన్నీ ఎలిమెంట్స్‌తో రౌడీ బాయ్స్ యూత్‌ని మెప్పిస్తుంది అన్నారు.
కాగా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం , కోమలి ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: