ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఎం.ఎస్ రాజు కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. ‘డర్టీ హరి’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఆ సినిమాతో సక్సెస్ కొట్టాడు ఎం.ఎస్ రాజు. ఇక ఆసినిమా ఇచ్చిన సక్సెస్ తో ఎం.ఎస్ రాజు ‘7 డేస్ 6 నైట్స్’ లాంటి యూత్ ఎంటర్టైనర్ తో వచ్చేస్తున్నాడు. ఈసినిమాను కరోనా ప్రభావం తగ్గిన తరువాతే స్టార్ట్ చేశారు. అయినా కూడా ఎం.ఎస్ రాజు అన్ని జాగ్రత్తలు తీసుకొని చాలా ఫాస్ట్ గానే షూట్ ను కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ, “నేను నా కెరీర్ లో అన్ని జానర్ లో సినిమాలు చేసాను, ఇక కేవలం మసాలా చిత్రాలకి మాత్రమే పరిమితం కాకుండా, ఎవరు చేయనివి చేద్దామనుకుంటున్నాను. నా ‘డర్టీ హరి’ పోస్టర్లు చూసి నేనిలా అయిపోయాను అని అనుకున్నారు. కానీ ఈసినిమాకు వచ్చిన స్పందన ఇప్పటికీ గుర్తుంది. అదే పంథాలో నాకు నచ్చేలా అందరూ మెచ్చేలా ఈసారి ఒక న్యూ జెన్ రోమ్-కామ్ చిత్రంతో అన్ని రకాల ప్రేక్షకులని అలరించబోతున్నాం. బ్యాచిలర్ ట్రిప్ కోసం గోవా కి వెళ్లిన ఇద్దరు యువకులు, ఇద్దరు యువతుల చుట్టూ జరిగే కథ ఇది. క్లాసిక్ చిత్రంగా మారే అన్ని హంగులు ఇందులో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ, తమని తాము ఇందులోని పాత్రలకి బాగా రిలేట్ చేసుకుంటారు. సంక్రాంతికి రానున్న ఈ చిత్రం, అందరికీ నచ్చుతుందని నమ్మకంగా ఉన్నాం” అని అన్నారు.
కాగా సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈసినిమాలో హీరోయిన్ గా మెహర్ చావల్ నటిస్తుంది. వీరితో పాటు రోహన్, కృతికా శెట్టి మరో జంటగా పరిచయమవుతున్నారు. ఈసినిమాను వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ లో సుమంత్ అశ్విన్, వింటేజ్ పిక్చర్స్ మరియుఏబిజి క్రియేషన్స్ బ్యానర్స్ పై రజనీకాంత్.ఎస్ తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈసినిమాకు సమర్థ్ గొల్లపూడి సంగీతం అందిస్తుండగా నాని చమిడి శెట్టి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: