సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఎన్నో అంచనాల మధ్య ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ తో అందరి ప్రశంసలను దక్కించుకుంటుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో బన్నీ పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ లుక్లో అదరగొట్టాడు. అందుకే సౌత్ లో మాత్రమే కాదు నార్త్ లో కూడా పుష్ప రాజ్ తన హవాను చూపిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సుకుమార్ గారి గురించి నేను ఎక్కువ చెప్పలేను.. ఆయన కూడా నా గురించి ఎక్కువ చెప్పలేరు.. ఎందుకంటే మేము చాలా దగ్గరగా ఉండే మనుషులం.. ఇంత పబ్లిక్ లో మాట్లాడాలంటే కాస్త సిగ్గుగా ఉంటుంది.. ఎక్కవగా పర్సనల్ గా ఉండే విషయాన్ని మనం పబ్లిక్ గా షేర్ చేయలేం.. సుకుమార్ నాకు అంత పర్సనల్ ఇష్యూ.. కానీ చెప్పాలి.. నా లైఫ్ సుకుమార్ ఉంటే ఇలా ఉంది.. సుకుమార్ లేకపోతే వేరేలా ఉండేది. నా జీవితం ఇంత సక్సెస్ ఫుల్ గా సాగుతుందంటే అది కేవలం సుకుమార్ వల్లే అన్నారు బన్నీ. నా జీవితంలో చాలా తక్కువమందికి మాత్రమే రుణపడి ఉన్న అందులో నా తల్లిదండ్రులు.. మా తాతగారికి.. నాకు అండగా నిలిచినా చిరంజీవిగారు ఉన్నారు. ఆతర్వాత తెలిసింది సుకుమార్ అంటే నాకు ఎంత ఇష్టమో. నువ్వు లేక పోతే నేను లేను.. ఆర్య లేదు.. మరేమీ లేవు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు బన్నీ..




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: