సూపర్ హిట్ “పెళ్ళిచూపులు” మూవీ తో టాలీవుడ్ కు హీరో గా పరిచయం అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి క్రేజీ హీరోగా మారారు. “గీత గోవిందం “, “టాక్సీవాలా”వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో విజయ్ ప్రేక్షకులను అలరించారు. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “లైగర్”లో నటిస్తున్న విషయం తెలిసిందే. అనన్య పాండే కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “నిన్నుకోరి “, “మజిలీ”మూవీస్ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీకి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సోషల్ మీడియాలో విజయ్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. 2018 మార్చి 7న విజయ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించగా తాజా గా14 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకుపోతున్నారు. టాలీవుడ్‌లో అల్లు అర్జున్ తర్వాత ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన హీరోగా విజయ్ నిలిచారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: