కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్స్ గోదావరి. గామి లాంటి హిట్ సినిమా తరువాత విశ్వక్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక రీసెంట్ గానే కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. మే 17వతేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ 27వ తేదీన సాయంత్రం 4గంటల 1 నిమిషానికి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక ఇప్పుడు మరో అప్ డేట్ ఇచ్చారు. ఈ టీజర్ డబ్బింగ్ ను విశ్వక్ సేన్ పూర్తిచేసినట్టు తెలిపారు. అంతేకాదు విశ్వక్ సేన్ ఫొటోను పోస్ట్ చేస్తూ డబ్బింగ్ పూర్తయిందని తెలుపుతూ శివాలెత్తిపోద్దాంతే అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
కాగా ఈసినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి,సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: