వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైం ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు పాల్గొన్నారు. ప్రభాస్ ప్రస్తుతం “సలార్”, “ఆదిపురుష్ ” మూవీస్ లో నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా రూపొందిన “రాధేశ్యామ్” మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ప్రాజెక్ట్ K ” చిత్ర యూనిట్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త చెప్పింది. ‘ఫేసెస్ ఆఫ్ ఫ్యూచర్’ పేరుతో ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు నటించేందుకు కొత్త నటీనటులను ఆహ్వానిస్తున్నామని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 12వ తేదీన బెంగళూరు, చెన్నైలలో, 15వ తేదీన పుదుచ్చేరి, కొచ్చిన్ లలో ఆడిషన్స్ ఉంటాయని తెలిపింది. యాక్టర్, మోడల్, డ్యాన్సర్, మార్షల్ ఆర్టిస్ట్, ఇలా ఎవరైనా సరే టాలెంట్ ఉంటే ఈ ఆడిషన్స్‌లో పాల్గొనేందుకు తమకు మెయిల్ చేయాలని స్పష్టం చేసింది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: