ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ రేపు రిలీజ్ కానున్న పుష్ప 2 ఫస్ట్ సాంగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పార్ట్ 1 ఆల్బమ్ చార్ట్ బాస్టర్ కావడం తో పుష్ప 2 ఆడియో ఫై భారీ అంచనాలు వున్నాయి.రేపు సాయంత్రం 5:04గంటలకు ఈ ఫస్ట్ సింగిల్ విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక షూటింగ్ విషయానికి వస్తే ఇంకా 30 శాతం బ్యాలెన్స్ వుంది. దాంతో మేజర్ బ్రేక్ లేకుండా షూటింగ్ ను కానిచ్చేస్తున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ తోపాటు మరికొందరి మీద అండర్ వాటర్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. జూన్ లో మొత్తం షూటింగ్ ను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
ఇక ప్రీ రిలీజ్ విషయానికి వస్తే పుష్ప 2 థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ కలిపి 1000కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం వుంది. ఓపెనింగ్స్ కూడా అదే అదిరిపోయే రేంజ్ లో వుండనున్నాయి.హిట్ టాక్ వస్తే బాహుబలి రికార్డులను తిరగరాయడం అసాధ్యమేమి కాకపోవచ్చు.తెలుగులో నే కాదు దేశ వ్యాప్తంగా పుష్ప 2కు భారీ హైప్ వుంది.జీనియస్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి. ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: