సీన్ టొవా స్టూడియోస్ మరియు సినీ మాస్ స్టూడియోస్ బ్యానర్స్ పై జాన్ పాల్ రాజ్ మరియు శ్యామ్ సూర్య దర్శకత్వం లో భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ , లోస్లియా మరియ నేసన్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫ్రెండ్ షిప్ “మూవీ తెరకెక్కింది. యాక్షన్ కింగ్ అర్జున్ ఒక కీలక పాత్రలో నటించారు. డి ఎమ్ ఉదయ్ కుమార్ సంగీతం అందించారు. అర్జున్ , హర్భజన్ ఇద్దరి యాక్షన్ సీన్స్ “ఫ్రెండ్ షిప్ “మూవీకి హైలైట్ కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు, తమిళ, హిందీ కన్నడ , మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా “ఫ్రెండ్ షిప్ “మూవీ తెలుగు ట్రైలర్ ను కింగ్ అక్కినేని నాగార్జున రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు. ‘ఫ్రెండ్ షిప్’ ట్రైలర్ ఫన్నీ, ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో “ఫ్రెండ్ షిప్ “మూవీ తెరకెక్కినట్లు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: