ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా.. వాటిలో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది మాత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి సినిమా కోసం. ఈసినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, వీడియోలు రిలీజ్ చేయగా అవి సినిమాపై క్రేజ్ ను మరింత పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా రిలీజ్ డేట్ పై మొదటినుండీ నుమానాలు రాగా అదే నిజం చేస్తూ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ను ఇచ్చారు. ఈసినిమా నైజాం రిలీజ్ హక్కులకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా నైజాం హక్కులను ప్రముఖ సంస్థ అయిన సినిమాస్ గ్లోబర్ వారు సొంతం చేసుకున్నట్టు తెలిపారు.
Nizam Area Grand Release By @CinemasGlobal 🔥#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898ADonJune27 https://t.co/lR9vnE764W
— Asian Cinemas (@AsianCinemas_) April 28, 2024
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: