మొత్తానికి గత ఏడాది సినిమాలు లేక బోసి పోయిన థియేటర్స్ ఈఏడాది మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు వచ్చేస్తున్నాయి. వారానికి కీనిసం నాలుగైదు సినిమాలైనా థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇక సినీ లవర్స్ కు మాత్రం వారం వారం పండగే. మొన్న శివరాత్రికి జాతి రత్నాలు, గాలి సంపత్, శ్రీకారం సినిమాలు రిలీజ్ అవ్వగా అవి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి. ఇక ఈవారం కూడా మరో మూడు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అవి ఆది సాయి కుమార్ హీరో గా వస్తున్న శశి, కార్తికేయ హీరోగా వస్తున్న చావు కబురు చల్లగా, శ్రీవిష్ణు-కాజల్ ప్రధాన పాత్రల్లో వస్తున్న మోసగాళ్ళు సినిమాలు. ఈసినిమాలు మూడు డిఫరెంట్ జోనర్లలో వస్తున్నాయి. మూడు సినిమాలపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. థ్రిల్లర్ నేపథ్యంలో శశి సినిమా వస్తుంది… మాస్ ఎంటర్టైన్ మెంట్ తో చావు కబురు చల్లగా సినిమా వస్తుంది.. మోసగాళ్ళు సినిమా ఐటీ స్కామ్ నేపథ్యంలో వస్తుంది. మరి ఈవారం విడుదల కాబోతున్న ఈసినిమాల్లో ఈసినిమాల్లో ఏసినిమా కోసం మీరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మీ ఓటు ద్వారా తెలపండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”57197″]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: