షూటింగ్ పూర్తి చేసుకున్నకె.జి.యఫ్ 2

KGF2 Movie Team Successfully Wraps Up Shooting Work,Yash Starrer KGF: Chapter 2 Wraps Up Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,KGF: Chapter 2,KGF: Chapter 2 Movie,KGF: Chapter 2 Telugu Movie,KGF: Chapter 2 Movie Updates,KGF: Chapter 2 Telugu Movie Latest News,KGF: Chapter 2 Movie Shooting Updates,KGF: Chapter 2 Telugu Movie Shooting Latest News,Yash

దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 కూడా ఒకటి. కె.జి.యఫ్ సినిమా సంచలన విజయంతో ఈ సినిమా కోసం కూడా ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలవ్వగా కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూాడా చేస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. ఇక యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మిలియన్ వ్యూస్ తో ఇప్పటికే టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ ను కూాడా పూర్తి చేసుకుంది. ఈవిషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.

ఇక ప్రపంచ వ్యాప్తంగా జులై 16న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి కె.జి.యఫ్ సంచలన విజయంతో కె.జి.యఫ్ 2 పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అవుతుందో లేదో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + nineteen =