‘నిన్నుకోరి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న సినిమా టక్ జగదీష్. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. అంతేకాదు చాలా కాలం తర్వాత మళ్లీ మాస్ అండ్ కమర్షియల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నాడు నాని. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమా ఏప్రిల్ 23 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఇంకోసారి ఇంకోసారి అనే మెలొడి సాంగ్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని-రీతూవర్మ మధ్య వచ్చే సాంగ్ అందర్నీ ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా నుండి కోలో కోలన్న కోలో అనే సాంగ్ విడుదల చేశారు. థమన్ సంగీతం అందించిన ఈ పాటకు.. సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించారు. అమ్రాన్ మాలిక్, హరిణి దీన్ని ఆలపించారు. ఈ సాంగ్‌లో ఫ్యామిలీ అంతా కలిసి సందడి చేయనున్నట్టే కనిపిస్తుంది.
#KoloKolannaKolo is Here
Hope U all like it 🖤🎧 Get ur Earphones NOW
My ❤️ to @ShivaNirvana @NameisNani @Shine_Screens
Written by #PadmaShri #sirivennala
Shri #Seetharamasastry gaaru ✊✨Sung by @ArmaanMalik22 @srikrisin @riturv @aishu_dil ♥️https://t.co/qMy6TrTsV4
— thaman S (@MusicThaman) March 13, 2021
కాగా రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇంకా సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటో గ్రఫీ ప్రసాద్ మూరెళ్ల అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: