ప్రస్తుతం శింబు వెంకట్ ప్రభు డైరెక్షన్లో ‘మానాడు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘రీవైన్డ్’ అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నిజానికి ఈ సినిమాను గత ఏడాదే ప్రకటించినా కరోనా వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. శింబు పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేశారు. తెలుగులో ఈ టీజర్ ను రవితేజ రిలీజ్ చేసి.. టీజర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని.. శింబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక హిందీ టీజర్ ప్రముఖ దర్శకులు అనురాగ్ కశ్యప్, తమిళ్ టీజర్ ఏ.ఆర్.రెహమాన్, కన్నడ టీజర్ కిచ్చా సుదీప్ రిలీజ్ చేశారు.
Happy Birthday @SilambarasanTR_ !! 🤗🤗 Super happy to launch the #Rewindteaser. Looks gripping! Good luck to the entire team! @vp_offl @sureshkamatchi @thisisysrhttps://t.co/WFiTDwoJiS
— Ravi Teja (@RaviTeja_offl) February 3, 2021
కాగా ఈ సినిమాలో శింబుకు జోడిగా కళ్యాణీ ప్రియదర్శన్ నటిస్తుండగా ఎస్‌ఏ చంద్రశేఖర్, భారతీరాజా, ప్రేమ్‌జీ అమరన్, కరుణాకరన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 125 కోట్ల భారీ బడ్జెట్ తో హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సురేష్ కామాక్షి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
దీనితోపాటు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో ‘ఈశ్వరుడు’ సినిమా చేస్తున్నాడు. లాక్‌డౌన్ తరవాత షూటింగ్ ప్రారంభించి చకచకా సినిమాను పూర్తి చేశారు. కాగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: