నితిన్ ‘చెక్’ ట్రైలర్ రిలీజ్

Nithiin Check Movie Trailer Is Out,Check,Check Movie,Check Telugu Movie,Check Trailer,Check Movie Trailer,Check Telugu Movie Trailer,Nithiin Check Trailer,Nithiin Check Official Trailer,Check Trailer Public Talk,Check Movie Trailer Public Talk,Check Telugu Movie Trailer Public Talk,Check Trailer Public Response,Check Movie Trailer Public Response,Check Telugu Movie Trailer Public Response,Check Movie Updates,Check Telugu Movie Latest News,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Check Telugu Movie Official Trailer

భీష్మ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు. అందులో నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న చెక్ సినిమా ఒకటి. జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. విభిన్నమైన కథతో వస్తుండటంతో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.. దానికి తోడు ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు ఇంకా పెరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ మాత్రం ఆకట్టుకుంటుంది. ఉరిశిక్ష పడిన ఒక ఖైదీ జైలు నుంచి ఎలా బయట పడ్డాడు. దేశద్రోహి ఎందుకు అయ్యాడు.. చెస్ కు అతనికి సంబంధం ఏంటీ.. చెస్ తో ఆ జైలు నుంచి ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చాడు? అన్నది కథలా అనిపిస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నట్టు అర్ధమవుతుంది ట్రైలర్ ను చూస్తుంటే. ట్రైలర్ తో నితిన్ మరో హిట్ ను కొట్టే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తుంది అప్పుడే. మరి చూద్దాం నితిన్ ఆ అంచనాలు రీచ్ అవుతాడో లేదో..

కాగా భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో లాయర్ గా రకుల్  కనిపించనుంది. కల్యాణిమాలిక్‌ ఈ సినిమాకు సంగీతం అందించగా..సినిమాటోగ్రఫీ రాహుల్‌ శ్రీవాత్సవ్‌ అందించాడు. ఫిబ్ర‌వ‌రి 26న ఈ సినిమా విడుద‌ల కానుంది.

ఇక వెంకీ అట్లూరి తో చేస్తున్న`రంగ్ దే` షూటింగ్ ఇప్పటికే పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుపుకుంటోంది. త్వర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. మరో వైపు అందదూన్ రీమేక్ షూటింగ్ లో ఉన్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.